: చేపల కూర ఎంత పని చేసిందో చూడండి!


చేపల కూర రెండు రాష్ట్రాల కార్మికుల మధ్య గొడవకు కారణమైంది. వివరాల్లోకి వెళ్తే, భద్రాచలం వద్ద గోదావరిపై రెండవ వారధి పనులు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ కు చెందిన కార్మికులు ఇక్కడకు వలస వచ్చి, పనుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బీహార్ కు చెందిన కొందరు కార్మికులు చేపలు తెచ్చుకుని, వంట చేసుకుని, తినేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో ఫుల్లుగా మద్యం తాగిన పశ్చిమ బెంగాల్ కు చెందిన 12 మంది కార్మికులు చేపల కూర తమకూ కావాలని కోరారు.

అయితే, కూర ఇచ్చేందుకు బిహార్ కార్మికులు నిరాకరించారు. దీంతో, ఆగ్రహానికి గురైన బెంగాల్ కార్మికులు కర్రలు, ఇనుపరాడ్లతో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ పలువురిని సెక్యూరిటీ సిబ్బంది భద్రాచలం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు, దాడి పట్ల బీహార్ కు చెందిన కార్మికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, దాడికి పాల్పడ్డవారిని అదుపులోకి తీసుకున్నామని... వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News