: హరి హరీ.. తిరుమలలోనూ మద్యం పారుతోందయ్యా!


పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలనూ మద్యం మహమ్మారి వదల్లేదు. అధికారుల నిర్లక్ష్యమా, లేక అవినీతా అన్నది ఆ గోవిందుడికే తెలియాలి కానీ, ఆయన అడుగుపెట్టిన నేలపై మద్యం కూడా పరుగులు పెడుతోంది. సాక్షాత్తూ కలియుగ వైకుంఠంగా హిందువులు భావించే ఇక్కడ తాజాగా విజిలెన్స్ అధికారుల తనిఖీలలో ఒక దుకాణం నుంచి నాలుగు మద్యం సీసాలు బయటపడ్డాయి. అక్కడే ఒక వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి కనిపించాడు. అధికారులు అతడిని అరెస్ట్ చేయడంతోపాటు, వెంటనే దుకాణాన్ని మూసివేయించి, ఆ దుకాణం లైసెస్స్(మద్యం లైసెన్స్ కాదు) రద్దు చేయాలని సిఫారసు చేశారు.

  • Loading...

More Telugu News