: హుషారుగా స్టెప్పులేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు


టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు 'బంతిపూల జానకీ జానకీ...నీ కింత సిగ్గు దేనికీ దేనికి' అంటూ రెచ్చి పోయి స్టెప్పులేశారు. ఆ వివరాలలోకి వెళితే, రేపు (జూన్ 14) రామ్మోహన్ నాయుడి వివాహం ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో జరగనుంది. విశాఖపట్టణానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తె శ్రావ్యతో గత మార్చిలో రామ్మోహన్ నాయుడి వివాహ నిశ్చితార్థం జరిగింది. కాగా, వివాహ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్ లో కాబోయే భార్య శ్రావ్యతో రామ్మోహన్ నాయుడు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో యువతను ఆకట్టుకుంటోంది. దానిని మీరూ చూడండి. 

  • Loading...

More Telugu News