: 'శవాసనమే సరి'... యోగా దినోత్సవం నాడు మోదీకి వినూత్న నిరసన తెలిపేందుకు రైతుల నిర్ణయం!
ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవం నాడు తమ సమస్యలు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి చేరేలా వినూత్న నిరసన తెలియజేయాలని రాజస్థాన్ రైతులు నిర్ణయించారు. నరేంద్ర మోదీ లక్నోలో 50 వేల మందితో కలసి యోగా చేసే సమయంలో 'శవాసనం' వేసి నిరసన తెలపాలని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ చీఫ్ శివ్ కుమార్ తెలిపారు. మొత్తం 62 రైతు సంఘాలు 16వ తేదీన మూడు గంటల పాటు జాతీయ రహదారులను దిగ్బంధించనున్నాయని, అప్పటికీ కేంద్రం దిగిరాకుంటే, రాజ్ ఘాట్ ను ముట్టడిస్తామని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా రైతులంతా యోగా దినోత్సవం నాడు శవాసనం వేయాలని కోరిన ఆయన, రైతుల గోడు, అసంతృప్తి కేంద్రానికి తెలియజెబుతామని అన్నారు.