: నేనేమైనా పాక్ నుంచి వచ్చానా?: అరెస్ట్ చేసిన పోలీసులతో హార్దిక్ పటేల్ తీవ్ర వాగ్వాదం


గుజరాత్ లో పటేల్ వర్గపు నాయకుడిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న యువ నేత హార్దిక్ పటేల్ ను ఈ ఉదయం మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లో పోలీసులు అరెస్ట్ చేయగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్ లోకి హార్దిక్ ప్రవేశించగానే, నీముచ్ ప్రాంతంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హార్దిక్ మాట్లాడుతూ, "నేనేమీ ఉగ్రవాదిని కాను. లాహోర్ నుంచేమీ రాలేదు. నేను భారత పౌరుడిని. దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకుంది" అని అన్నాడు.

నిరసనలు తెలుపుతున్న వారికి మద్దతిచ్చి, వారికి అండగా ఉంటానన్న భరోసా ఇచ్చేందుకే తాను వచ్చానని ఈ సందర్భంగా హార్దిక్ వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు జనతాదళ్ (యునైటెడ్) నేత అఖిలేష్ కతియార్ ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని తమ వాహనంలో మధ్యప్రదేశ్ సరిహద్దులను దాటించి విడిచిపెట్టారు. కాగా, రైతులు హింసకు దిగరాదని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రేపు రైతుల కుటుంబాలను ప్రత్యేకంగా కలవనున్నారు.

  • Loading...

More Telugu News