: అనుమానాస్పద పరిస్థితుల్లో బాలీవుడ్ నటి కృతికా చౌదరి మరణం!
బాలీవుడ్ నటి కృతికా చౌదరి (30) ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని తన ఇంట్లో అంతు చిక్కని పరిస్థితుల్లో విగతజీవిగా కనిపించింది. ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని ఇరుగు, పొరుగు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు కృతిక మరణించిన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అంధేరీ వెస్ట్ ప్రాంతంలోని చార్ బంగ్లా ప్రాంతంలో ఉన్న భైరవ్ నాథ్ సొసైటీలో ఆమె నివాసం ఉంటున్నారు. మూడు, నాలుగు రోజుల క్రితమే ఆమె మరణించి వుండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, హత్య కేసును నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. తొలుత ఏడీఆర్ (యాక్సిటెంటల్ డెత్ రిపోర్టు) రాసినప్పటికీ, విచారణలో ఆమె హత్య చేయబడి వుండవచ్చని అనుమానించామని అంబోలీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.