: కూలిన గురుద్వారా.. ఒకరి మృతి, శిథిలాల కింద పలువురు భక్తులు
హరియాణాలోని పానిపట్‌లో శ్రీ గురు సింగ్ సాహిబ్ గురుద్వారా కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. నిర్మాణ పనులు జరుగుతుండగా సోమవారం మూడో అంతస్తులోని రూఫ్ ఒక్కసారిగా కూలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో గురుద్వారాలో ఉన్నారు. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు ఐదుగురిని రక్షించినట్టు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గురుద్వారా కూలడానికి సరైన కారణం తెలియకపోయినా పురాతన కాలం నాటిది కావడం వల్లే ఈ ఘటన జరిగినట్టు అనుమానిస్తున్నారు.