: బీజేపీ ప్రభుత్వాల బాటలో కాంగ్రెస్... రైతు రుణాల రద్దుకు ముందుకొచ్చిన పంజాబ్!


ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర బాటలో పంజాబ్ నడుస్తోంది. ఆ రెండు రాష్ట్రాలు చేసినట్టుగా రైతుల రుణాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 20న ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతవారం మధ్యప్రదేశ్‌లో రైతులు నిర్వహించిన ఆందోళన సోమవారం పంజాబ్‌కు పాకింది. రుణాలు రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన నిర్వహించారు. దీంతో స్పందించిన అమరీందర్ సింగ్ ప్రభుత్వం రైతుల రుణాలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రైతుల డిమాండ్‌పై ఆర్థిక శాఖామంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. రైతు రుణాలపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించే అవకాశం ఉందన్నారు. అయితే ఆ కమిటీ ఏమేమి ప్రతిపాదనలు చేసిందో తాను చెప్పలేనని, ఈనెల 20న అది అసెంబ్లీ ముందుకు వస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, దానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News