: గంగూలీ! ఓడిపోయానుగా... జెర్సీ పంపించు.. వేసుకుంటాను!: షేన్ వార్న్


ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఓవల్ లో ఇంగ్లండ్ చేతిలో ఆసీస్ ఓటమిపాలు కావడంతో...చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు జెర్సీ రోజంతా ధరిస్తానని, ఒక జెర్సీ పంపించాలని ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ టీమిండియా దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీని కోరాడు. ఓవల్ లో జరిగిన ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ జరగడానికి ముందు విశ్లేషణ సందర్భంగా, సౌరవ్‌ గంగూలీ ఈ మ్యాచ్ లో ఆసీస్ కంటే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న ఇంగ్లండ్ గెలిచే అవకాశం ఉందని అన్నాడు. అంతే కాకుండా ఇంగ్లండ్ కు స్థాన బలం కూడా కలిసివస్తుందని చెప్పాడు. దీనికి అంగీకరించని షేన్ వార్న్ కల్పించుకుని ఆసీస్ దే విజయమని అన్నాడు.

అంతే కాకుండా, ఆసీస్ గెలిస్తే గంగూలీ తమ జట్టు ధరించే జెర్సీ ధరించాలని, అలాగే షడ్రుచులతో డిన్నర్ కూడా ఇవ్వాలని కవ్వించాడు. ఆసీస్ ఓడిపోతే తాను ఇంగ్లండ్ జెర్సీ ధరించి, డిన్నర్ ఇస్తానని అన్నాడు. ఈ ప్రతిపాదనకు తొలుత నవ్వేసిన గంగూలీ...వార్న్ రెట్టించడంతో సరే అన్నాడు. ఈ మ్యాచ్ లో గంగూలీ చెప్పినట్టు ఇంగ్లండ్ గెలిచింది, ఆసీస్ ఓడిపోయింది. దీంతో పందెంలో ఓడిపోయిన షేన్‌వార్న్‌ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘ఆసీస్‌-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ ఫలితంపై వేసుకున్న పందెంలో గంగూలీ నువ్వే గెలిచావు. త్వరలో ఇంగ్లాండ్‌ వన్డే జెర్సీని రోజంతా ధరిస్తాను...ఇంకో విషయం ఏంటంటే ఆ జెర్సీని కూడా నువ్వే పంపు’ అని ట్వీటాడు. 

  • Loading...

More Telugu News