: ప్రస్తుతం ఆది సరసన నటిస్తున్నాను: టీవీ యాంకర్ రష్మి


విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో కొత్తగా ఏర్పాటు చేసిన హోంఫుడ్స్‌ దుకాణం ప్రారంభోత్సవంలో ‘జబర్దస్త్‌’ యాంకర్‌, సినీ నటి రష్మి పాల్గొని సందడి చేసింది. రష్మి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా రష్మి మీడియాతో మాట్లాడుతూ.. తాను భవిష్యత్తులో విశాఖపట్నంలోనే స్థిరపడతానని చెప్పింది. తాను ప్రస్తుతం తెలుగు చిత్రాల్లోనే నటిస్తున్నానని, గీతా ఆర్ట్స్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ సినిమాలో తాను ఆది సరసన నటిస్తున్నాన‌ని చెప్పింది. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ అవుతుంద‌ని తెలిపింది.            

  • Loading...

More Telugu News