: కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత... లోనికి దూసుకెళ్లేందుకు కాంట్రాక్టు ఉద్యోగుల యత్నం


తమ ఉద్యోగాలను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ, కాంట్రాక్టు కార్మికులు బేగంపేటలోని ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉదయం క్యాంపు కార్యాలయానికి దూసుకొచ్చిన కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని చెబుతూ వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో బేగంపేట రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానన్న హామీ ఇచ్చిన కేసీఆర్, మూడేళ్లయినా దాన్ని నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు.

  • Loading...

More Telugu News