: గుండెజబ్బులకు విరుగుడు పాము విషం!
హృద్రోగ సమస్యలకు పాము విషం కూడా మందుగా పని చేస్తుందని తైవాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హృద్రోగ సమస్యలు ఉన్నవారిలో రక్తం గడ్డకట్టకుండా ఉంచేందుకు ఆస్పిరిన్ మాత్రలు వినియోగిస్తుంటారని వారు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఆస్పిరిన్ మాత్రలు వాడడం వల్ల యాక్సిడెంట్ లు జరిగితే తీవ్ర రక్తస్రావం జరుగుతుందని చెప్పారు. అయితే ఆస్పిరిన్ మాత్రల కారణంగా జరిగే రక్తస్రావాన్ని అరికట్టేందుకు ట్రోపిడోలేమస్ వాగ్లెరిక్స్ అనే పాము విషం ఉపయోగకరమని తాము చేసిన అధ్యయనంలో తేలిందని అన్నారు.