: 108 పేజీల 'కల్వా వారి వివాహ ఆహ్వానము'... పెళ్లి'పత్రిక' ఎంత ప్రత్యేకమో!


తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వరంగల్‌ శాంతినగర్‌ కు చెందిన 'కల్వా' కుటుంబం వినూత్నంగా తీర్చిదిద్దింది. ఈ ప్రాంతంలో మెడికల్‌ ఏజెన్సీని నిర్వహిస్తున్న కల్వా భాగ్యలక్ష్మి, శివ ప్రసాద్‌ దంపతులు 108 పేజీల పెళ్లి పత్రికను ముద్రించారు. 14న హైదరాబాద్‌ లో వివాహం జరగనుండగా, వివాహం, ఆపై 17న హన్మకొండలో జరిగే విందు సమాచారాన్ని కూడా అందులో పొందుపరిచారు.

ఈ వివరాలు చెప్పడానికి 108 పేజీలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఆగండి... ఇవి మాత్రమే కాదు. రైల్వే సమాచారం, ఆర్టీసీ బస్సుల వివరాలు, బ్యాంకులు, అంబులెన్స్‌, ప్రభుత్వాసుప్రతులు, హోటళ్లు, విద్యుత్తు కార్యాలయాలు, గ్యాస్‌ ఏజెన్సీలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో ఉంది. వీటితో పాటు వరంగల్‌ లోని వివాహాది వేడుకలు నిర్వహించుకోదగ్గ మందిరాల వివరాలు, పోలీసు స్టేషన్ల ఫోన్ నంబర్లు, డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థల వివరాలు, ఈ సంవత్సరం ద్వాదశ రాశి ఫలాలు తదితర వివరాలన్నీ ముద్రించారు.

వివిధ సమయాల్లో ఆచరించాల్సిన పూజలు, విఘ్నేశ్వర, శ్రీవెంకటేశ్వర, శివ, విష్ణు, శ్రీలక్ష్మీనృసింహ, అయ్యప్ప, ఆంజనేయ, సుబ్రహ్మణ్య, సాయిబాబా, మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి తదితరాలను కూడా ముద్రించి వినూత్నంగా తయారు చేసుకున్నారు. మొత్తానికి తమ శుభలేఖను పదికాలాల పాటు దాచుకునేలా ముద్రించిన కల్వా వారి ఇన్విటేషన్ అందర్నీ ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News