: భారతీయ ముస్లింలకు శుభవార్త చెప్పిన సౌదీ అరేబియా
భారత్ లోని ముస్లింలకు సౌదీ అరేబియా శుభవార్త చెప్పింది. ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాను సందర్శించేందుకు వారి పవిత్ర మాసమైన రంజాన్ నెలలో హజ్ యాత్రకు భారీ సంఖ్యలో బారులు తీరుతారు. అయితే ప్రతి ఏటా పరిమిత సంఖ్యలో మాత్రమే సౌదీ అరేబియా హజ్ యాత్రికులకు అనుమతులిస్తుంది. హజ్ యాత్రకే వెళ్లేవారికి వక్ఫ్ బోర్డు అనుమతులు మంజూరు చేస్తుంది. తాజాగా సౌదీఅరేబియాతో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ ఏడాది 1,70,025 మంది హజ్ యాత్రకి అనుమతించారు. దీనిపట్ల ముస్లిం వర్గాలను నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రతి ముస్లిం జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాను దర్శించాలన్నది నిబంధన. దీంతో ప్రతి ముస్లిం హజ్ యాత్రకు సిద్ధమవుతాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది 1,36,020 ముంది హజ్ యాత్రకు వెళ్లగా, ఈ సారి 1,70, 025 మందిని అనుమతించనున్నారు. ఇందులో 1.25 లక్షల సీట్లను భారత హజ్ కమిటీకి రిజర్వ్ చేయగా, మిగిలిన 45 వేల సీట్లను ప్రైవేటు టూర్ ఆపరేటర్లకు కేటాయించారు.