: కొడుకుల కోసం ‘దేశీ’ గాళ్స్‌ను చూస్తున్న రబ్రీ.. మాల్స్ కెళ్లే అమ్మాయిలకు నో చాన్స్ అట!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారుల పెళ్లిళ్లకు సమయం వచ్చింది. వారి కోసం అచ్చమైన గ్రామీణ అమ్మాయిలను చూస్తున్నట్టు లాలు సతీమణి రబ్రీదేవి పేర్కొన్నారు. బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్వి ప్రసాద్ యాదవ్‌లకు వివాహ సమయం దగ్గర పడిందని భావించిన ఆమె వారి కోసం మాల్స్‌కు వెళ్లే అమ్మాయిలను కాకుండా గ్రామీణ యువతులను చూస్తున్నట్టు చెప్పారు.
ఆదివారం లాలు నివాసంలో ఆయన 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రబ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలకు, మాల్స్‌కు, షికార్లకు వెళ్లే అమ్మాయిలు నచ్చరని పేర్కొన్నారు. తన తర్వాత ఇంటిని జాగ్రతగా చూసుకునే అమ్మాయిలు కావాలని, పెద్దలను గౌరవించగలగాలని, తనలాగా బయట పనులను చక్కదిద్దుకునే అమ్మాయిలే తనకు కోడళ్లుగా సరిపోతారని రబ్రీ పేర్కొన్నారు.