: సచిన్, గంగూలీ, లక్ష్మణ్ రెమ్యూనరేషన్ అడగలేదు...ఆ పత్రిక కథనం అవాస్తవం!: బీసీసీఐ


బీసీసీఐ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులు, దిగ్గజ మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ తో కూడిన కమిటీ టీమిండియా కోచ్‌ ఎంపిక కోసం రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందంటూ వచ్చిన కథనంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాధార వార్తలు రాయడం సరికాదని సూచించింది. సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌ లు రెమ్యూనరేషన్‌ అడగలేదని, ఉచితసేవలు అందిస్తున్నారని, అలాంటి వారిపై బురదజల్లడం సహేతుకం కాదని సూచించింది. దిగ్గజ క్రికెటర్ల గౌరవానికి భంగం కలిగేలా కథనాలు ప్రచురించడం దారుణమని పేర్కొంది. కాగా, లండన్ లో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీతో సమావేశమైన సందర్భంగా సలహా కమిటీ సభ్యులు రెమ్యూనరేషన్ డిమాండ్‌ చేశారంటూ ఒక జాతీయ పత్రిక కథనం రాసింది. దీనిని బీసీసీఐ ఖండించింది.

  • Loading...

More Telugu News