: సౌతాఫ్రికాను ఇంటికి పంపించి... సెమీ ఫైనల్స్ కు చేరిన టీమిండియా!


ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ బి నుంచి టీమిండియా సెమీ ఫైనల్ లో చేరింది. పాకిస్థాన్ తో గెలిచి, శ్రీలంకతో ఓటమిపాలైన టీమిండియా నేడు జరిగిన మ్యాచ్ లో సఫారీలపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీ ఫైనల్ లో చోటు సంపాదించింది. తరువాతి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడనుంది. రేపటి మ్యాచ్ లో విజేత సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. ఈ లెక్కన ఫైనల్ లో టీమిండియాతో ఇంగ్లండ్ తలపడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, 192 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే రోహిత్ శర్మ (12) వికెట్ కోల్పోయింది. అనంతరం ధావన్ (78) అద్భుతంగా ఆడి అవుట్ కాగా, కోహ్లీ (76), యువరాజ్ సింగ్ (23) జట్టును విజయం వైపు నడిపించారు. దీంతో 38వ ఓవర్లో యువీ సిక్సర్ బాదడం ద్వారా రెండు వికెట్ల నష్టానికి టీమిండియా 193 పరుగులు చేసింది. దీంతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది.

  • Loading...

More Telugu News