: డీజే అద్భుతంగా ఉంటుంది: రావు రమేష్


దువ్వాడ జగన్నాథమ్ (డీజే) సినిమా అద్భుతంగా ఉంటుందని రావు రమేష్ తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో నిర్వహించిన ఈ ఆడియో వేడుకలో తన అనుభవాన్ని పంచుకుంటూ, 'డీజే సినిమా చేస్తున్న సమయంలో ఓసారి అల్లు అర్జున్ గారు నాతో మాట్లాడుతూ.... రమేష్ గారూ, మొదట్లో సినిమాలు చేస్తుంటే ఎవరి కోసం సినిమా చేయాలా? అనిపించేది. నా కోసమా? డబ్బులు పెట్టే నిర్మాత కోసమా? లేకపోతే తీవ్రంగా కష్టపడే దర్శకుడి కోసమా? అని తీవ్రంగా ఆలొచిస్తే... వీళ్లందరికోసం కాదు... సినిమా చూసి ఎంతో ఆనందించే ఆడియెన్స్ కోసం చేయాలని తేలిందండీ' అని అన్నారు. అలాంటి నటుడితో కలిసి నటించడం గొప్ప విషయం. ఇక నిర్మాత దిల్ రాజు తన కొత్త బంగారు లోకం సినిమా నుంచి తీసిన ప్రతి సినిమాలోనూ నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు' అన్నారు. ఇందులో తన తండ్రిని ప్రతి క్షణం గుర్తు చేసే రొయ్యల నాయుడు పాత్రను తనకు ఇచ్చిన హరీష్ శంకర్ కి కృతజ్ఞతలని ఆయన చెప్పారు.

అనంతరం మురళీ శర్మ మాట్లాడుతూ, ఈ రోజు ఈ పాట చూశాక సినిమా విడుదల తేదీ 23 వరకు ఎదురు చూడాలంటే చాలా కష్టమని, తాను అలా ఎదురు చూడలేనని అన్నారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కు ధన్యవాదాలని ఆయన చెప్పారు. తాను కూడా  అందరి ఫ్యాన్స్ లా అల్లు అర్జున్ ఫ్యాన్ నని అన్నారు. అందర్లాగే తాను కూడా బన్నీ డ్యాన్స్ చేస్తుంటే చూడాలని భావించానని, అయితే పాట చిత్రీకరించేటప్పుడు మాత్రం తనను మర్చిపోయారని హరీష్ శంకర్ ను ఆయన నిష్టూరమాడారు. 

  • Loading...

More Telugu News