: వికెట్ నష్టానికి 75 పరుగులు చేసిన టీమిండియా


టీమిండియా అర్ధసెంచరీ చేసింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రోహిత్ శర్మ (12) కాసేపట్లోనే అవుటయ్యాడు. అనంతరం శిఖర్ ధావన్ (35)కు జతకలిసిన కోహ్లీ (26) ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ చెత్తబంతులను బౌండరీ లైన్ దాటిస్తూ ఆకట్టుకుంటున్నారు. దీంతో 17 ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో మోర్కెల్ ఒక వికెట్ తీశాడు. ఆడుతూపాడుతూ లక్ష్యం దిశగా టీమిండియా సాగిపోతోంది.

  • Loading...

More Telugu News