: బంగారం లాంటి రెండు అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా....సఫారీ 50/0


ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న పోరులో టీమిండియా రెండు అవకాశాలు వృథా చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు క్వింటన్ డికాక్ (29), హషీమ్ ఆమ్లా (33) శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ వికెట్ పోకుండా జాగ్రత్త పడ్డారు. ఆమ్లా పలు సందర్భాల్లో వికెట్ల ముందుకు వచ్చి భారీ షాట్లు ఆడు ప్రయత్నం చేసి, టీమిండియా బౌలర్ల లయ దెబ్బతీయాలని చూసినా, కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకున్నారు.

ఈ క్రమంలో 13వ ఓవర్ ఐదో బంతిని డికాక్ ఆఫ్ సైడ్ గా కొట్టి పరుగుతీశాడు. ఆ సమయంలో వేగంగా స్పందించిన కోహ్లీ ముందుకు దూసుకువచ్చి నేరుగా బంతిని అందుకుని త్రో చేశాడు. అయితే బంతి వికెట్లను తాకకుండా పక్కనుంచి వెళ్లిపోయింది. దీంతో అవుటయ్యే ప్రమాదం నుంచి డికాక్ బయటపడ్డాడు. తరువాతి బంతిని ఆమ్లా డిఫెన్స్ ఆడగా బంతి గాల్లో లేచి బౌలర్ దిశగా వచ్చింది. అయితే బంతిని వేసిన పాండ్య పక్కకు జరగడంతో ఆ క్యాచ్ మిస్సైంది. దీంతో రెండు బంగారం లాంటి అవకాశాలు చేజారాయి. దీంతో తరువాత పాండ్య వేసిన ఓవర్ లో సఫారీలు పది పరుగులు పిండుకున్నారు. దీంతో 16 ఓవర్లకు వికెట్ నష్టపోని సౌతాఫ్రికా 67 పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News