: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా...జట్టులో ఒక్క మార్పు
ఇంగ్లండ్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగే వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో కొనసాగాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్ ను భారత్, సౌతాఫ్రికాలు తలపడుతున్నాయి. క్రికెట్ లో అగ్రశ్రేణి జట్లుగా పేరున్న ఈ రెండు జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యాయి.
టీమిండియా బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసే దిశగా ఒక్క మార్పు చేసింది. కేవలం బౌలింగ్ మాత్రమే చేయగల ఉమేష్ యాదవ్ స్థానంలో బౌలింగ్ తో పాటు బ్యాటు ఝళిపించగల రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకుంది. దీంతో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ విభాగం కూడా మరింత బలోపేతమైంది. పేస్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఆడగల సఫారీలను అశ్విన్ స్పిన్ తో కట్టడి చేస్తాడని టీమిండియా భావిస్తోంది.