: యువతి ఫిర్యాదుతో అరెస్ట్ చేసేందుకు వెళితే చెయ్యి కోసుకున్న కానిస్టేబుల్


ఓ యువతిపై దురుసుగా ప్రవర్తించి వేధించిన కేసులో కడప జిల్లా శంకరాపురంకు చెందిన ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పవన్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లిన వేళ, అరెస్టును తప్పించుకునేందుకు పవన్ కుమార్ చెయ్యి కోసుకున్నాడు. ఈ ఘటనలో పవన్ ను అడ్డుకోవాలని చూసిన కానిస్టేబుల్ సుదర్శన్ రాజుకు కూడా గాయాలు అయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పవన్ కుమార్ ఈ నెల 1వ తేదీన ఓ యువతిపై దాడి చేశాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన చిన్నచౌక్ పోలీసులు, విచారించి, పవన్ తప్పుందని నిర్ణయించుకుని, అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. దీన్ని గమనించిన పవన్ తన చేతికి గాయం చేసుకున్నాడు. అతనితో పాటు గాయపడ్డ మరో కానిస్టేబుల్ సుదర్శన్ ను ఆసుపత్రికి తరలించారు. సుదర్శన్ ఫిర్యాదు మేరకు పవన్ పై మరో కేసును నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News