: కొత్త విద్యార్థుల్లో 30 శాతం మంది అమ్మాయిలే... ఐఐఎం కోల్ కతా కొత్త రికార్డు


2017-19 విద్యా సంవత్సరానికిగాను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) కోల్ కతాలో చేరిన కొత్త విద్యార్థుల్లో 31 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు. సంస్థను స్థాపించిన తరువాత ఇప్పటివరకూ ఈ స్థాయిలో విద్యార్థినుల సంఖ్య పెరగడం ఓ రికార్డని, మేనేజ్ మెంట్ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్న అమ్మాయిల సంఖ్య పెరగడం, మేనేజ్ మెంట్ విద్యను మరింత నాణ్యం చేస్తుందని వర్శిటీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్, బెంగళూరుల్లోని ఐఐఎంలతో పోలిస్తే, కోల్ కతాలో ఇప్పుడు విద్యార్థినుల సంఖ్య అధికమని కాలేజీ అడ్మిషన్ విభాగం చైర్ పర్సన్ ప్రీతమ్ బసు వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూ దశలో అబ్బాయిల కన్నా, అమ్మాయిలు మెరుగైన ప్రతిభను కనబరిచారని, క్యాట్ స్కోరులోనూ వారే ముందున్నారని వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా 20 నుంచి 22 శాతం మాత్రమే ఉన్న అమ్మాయిల సంఖ్యను మరింతగా పెంచేందుకు ఈ సంవత్సరం అమ్మాయిలకు రెండు మార్కులను కలపాలని నిర్ణయించామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News