: ఏపీలో ఊపందుకోనున్న ఐటీ.. కంపెనీల స్థాపనలో హెచ్‌సీఎల్ సహా 50 కంపెనీలు బిజీ.. నిరుద్యోగులకు శుభవార్త!
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఊపందుకోనుంది. దాదాపు 50 కంపెనీలు నవ్యాంధ్రలో కంపెనీల స్థాపనలో బిజీగా ఉన్నాయి. ఫలితంగా వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఉద్యోగాల తీసివేత వార్తలతో ప్రస్తుతం ఐటీ సెక్టార్ సంక్షోభంలో ఉన్న సమయంలో తాజా పరిణామాలను శుభసూచకంగా చెబుతున్నారు. హెచ్‌సీఎల్, బీపీఓ, అమ్జుర్ టెక్నాలజీస్, ప్రైమ్ ఎరా టెక్, కేపీఎండీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, డాక్టస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌తో పాటు మరికొన్ని సంస్థలు ఏపీలో తమ యూనిట్ల స్థాపనకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 23 చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు విజయవాడ, విశాఖపట్టణం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.