: భారత్, పాక్ సరిహద్దుల్లో ఆర్మీ ఆపరేషన్ లో 13 మంది ఉగ్రవాదుల హతం
భారత్, పాక్ సరిహద్దు నుంచి ఇండియాలోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారంటూ ఐబీ చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తోన్న ఉగ్రవాదుల ఆగడాలను భారత ఆర్మీ కట్టడి చేస్తోంది. తాజాగా సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన అతి పెద్ద సెర్చ్ ఆపరేషన్‌పై ఈ రోజు ఆర్మీ అధికారులు వివరాలు తెలిపారు.
గడిచిన 96 గంటల్లో 13 మంది చొరబాటుదారులను హతమార్చిందని చెప్పారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.