: ఇంగ్లండ్ లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ధోనీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో గెలిచి, రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో ఓడిన విషయం తెలిసిందే. రేపు దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. మ్యాచ్‌కి, మ్యాచ్‌కి మధ్య కాస్త సమయం దొరికినప్పుడు టీమిండియా క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా స్టార్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ తన భార్య సాక్షి, కుమార్తె జివాతో కలిసి ఓ హోటల్‌కి వెళ్లి సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీరూ చూడండి..