: ఆదిలోనే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బలు!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఆస్ట్రేలియా ఇచ్చిన 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కేవలం నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ఆరు పరుగుల వద్దే రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు రాయ్ 4, హేల్స్ 0 పరుగులకే ఔట్ కావడంతో ఇంగ్లండ్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ప్రస్తుతం రూట్ (2), మోర్గాన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్‌లలో స్టార్క్, హెచ్.వుడ్‌లకు చెరో వికెట్ దక్కింది.