: మంత్రి హరీశ్ రావుకి తప్పిన ప్రమాదం
మహబూబాబాద్‌లో పర్యటిస్తోన్న తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకి ప్రమాదం తప్పింది. జిల్లాలోని మరిపెడ మండలం కొండసముద్రంలో నిర్వహిస్తోన్న పలు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ వేసిన టెంట్ ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో హరీశ్‌రావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.