: బాలయ్య గొంతుకి ఏమైంది?: పూరీ జగన్నాథ్‌కి ఓ అభిమాని ప్రశ్న
ఈ రోజు ఫేస్‌బుక్ లైవ్‌లో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు వారు రిప్లై ఇచ్చారు. బాలయ్య గొంతు కాస్త బొంగురుపోవడంతో 'బాలయ్య గొంతుకి ఏమైంది?' అని ఓ అభిమాని అడిగాడు. దానికి పూరీ జగన్నాథ్ సమాధానం చెబుతూ.. నిన్న తీసిన వర్షం సాంగులో బాలయ్య బాబు తడిచారని, దీంతో ఆయన గొంతు అలా మారిపోయిందని సమాధానం ఇచ్చాడు.
‘మా గళం మా బలం మా దైర్యం.. మా పొగరు నిన్ను చూసుకొనే.. నీ మాటే శాసనం నీ పిలుపే ప్రభంజనం.. జై బాలయ్య’ అంటూ ఓ అభిమాని డైలాగు వదిలాడు. ‘మీ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా అదుర్స్.. బాలయ్య బాబు గారు మీరు చరిత్రలో శాశ్వతంగా గుర్తుండి పోవాలంటే... ఎక్కువగా హిస్టారిక్ ఐకాన్ సినిమాలు చెయ్యాలి.. అంటే ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ సింగ్ లాంటి వీరుల చరిత్రలు చెయ్యాలి’ అని ఓ అభిమాని బాలయ్యను కోరాడు. ‘బాలయ్య తోపు దమ్ముంటే ఆపు’ అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌ను పూరీ జగన్నాథ్ చదివి వినిపించాడు. ‘జై గణేశ్.. జై జై గణేశ్ అనేది మన గణేశుడి భక్తుల నినాదమని, జై బాలయ్య.. జై జై బాలయ్య అనేది మా బాలయ్య అభిమానుల నినాదం’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఈ వీడియోని ఇప్పటికే నాలుగు లక్షల మంది చూశారు.. మీరూ చూడండి...