: వెస్టిండీస్ కు షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్థాన్!


వెస్టిండీస్ క్రికెట్ టీమ్ కు పసికూన ఆఫ్ఘనిస్థాన్ షాక్ ఇచ్చింది. సెయింట్ లూసియాలో జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్ 63 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ కు దిగిన విండీస్ జట్టు 44.4 ఓవర్లలో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ తన స్పిన్ మాయాజాలంతో విండీస్ వెన్ను విరిచాడు. ఆరవ బౌలర్ గా బరిలోకి దిగిన రషీద్ 18 పరుగులు మాత్రమే ఇచ్చి, ఏకంగా 7 వికెట్లు తీశాడు.  

  • Loading...

More Telugu News