: థమ్సప్ లో పాము... వాంతులు చేసుకున్న వినియోగదారుడు!
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మండలం బొమ్మూరు గ్రామంలోని జనరల్ స్టోర్ లో అమ్మిన థమ్సప్ బాటిల్ లో పాము కలకలం రేపింది. రాజమండ్రికి చెందిన బూలా నాగరాజు ఆ షాపులో థమ్సప్ కొని తాగుతుండగా, అందులో మూడు అంగుళాల చచ్చిన పాము పిల్ల కనిపించింది. దానిని చూసిన నాగరాజు వెంటనే వాంతులు చేసుకున్నాడు. కూల్ డ్రింక్ కంపెనీపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని తెలిపి, ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు.