: ప్రైవేటు ట్రావెల్స్ కు అరుణాచల్ ప్రదేశ్ షాక్.... తెలుగు రాష్ట్రాలకు చెందిన 900 బస్సుల పర్మిట్లు రద్దు!


ప్రయాణికుల నుంచి డబ్బు దండుకోవడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులకు అరుణాచల్ ప్రదేశ్ షాకిచ్చింది. పర్యాటక రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ లో 2+1 విధానంతో స్లీపర్‌ సీట్లు ఏర్పాటు చేసుకునే అవకాశంతో పాటు కేవలం 15,000 రూపాయల పర్మిట్‌ పన్ను మాత్రమే ఉండడంతో ఏపీ, తెలంగాణకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు తమ బస్సులను అక్కడ రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, తెలుగు రాష్ట్రాల ప్రయాణికులను దోచుకుంటున్నారు.

అయితే, నిబంధనల మేరకు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి బస్సు నెలకు ఒకసారైనా అక్కడికి వెళ్లిరావాల్సి ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు చేయని ప్రైవేటు బస్సులు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికులను మాత్రం యథావిధిగా ప్రయాణికులను దోచుకుంటున్నాయి. దీనిపై ఏపీ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి ఒకరు అరుణాచల్ ప్రదేశ్ రవాణాశాఖ మంత్రికి ఫిర్యాదు చేయగా, దానిని నిర్ధారించుకున్న అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ భేటీలో సుమారు 1000 బస్సుల పర్మిట్ లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీఏ ఆఫీసులకు ఆదేశాలు పంపింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ షాక్ తిన్నాయి. ఈ నేపథ్యంలో, త్వరలోనే ఏపీ, తెలంగాణల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని నడుపుతామని ట్రావెల్స్ యజమానులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News