: బౌలింగ్ షో... న్యూజిలాండ్ ను బంగ్లా బౌలర్లు కట్టడి చేస్తే.. బంగ్లాకు చుక్కలు చూపుతున్న టిమ్ సౌతీ!
ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కార్డిఫ్ లో జరుగుతున్న వన్డేలో బౌలింగ్ షో నడుస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ ను బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఒక దశలో బలంగా కనిపించిన కివీస్ ను అద్భుతంగా కట్టడి చేసి 265 పరుగులకు పరిమితం చేశారు. విలియమ్సన్ (57), రాస్ టేలర్ (63) అర్ధసెంచరీలతో రాణించగా, గుప్టిల్ (33), బ్రూమ్ (36), నీషమ్ (23) ఆకట్టుకున్నారు. రోంచి (16), కోరె ఆండర్సన్ (0), మైల్ (7) విఫలమయ్యారు. శాంటనర్ (14), సౌతీ (10) చివర్లో నిలబడడంతో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో మడ్ హాక్ మూడు వికెట్లతో రాణించగా, రెండు వికెట్లతో టస్కిన్ అహ్మద్ ఆకట్టుకున్నాడు. వారికి ముస్తాఫిజుర్, రూబెల్ హాసన్ సహకరించారు.
అనంతరం 266 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ను కివీస్ బౌలర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. తమీమ్ ఇక్బాల్ (0), సౌమ్యా సర్కార్ (3), సబ్బీర్ రెహ్మాన్ (8) ను టిమ్ సౌతీ పెవిలియన్ కు పంపించాడు. దీంతో కేవలం ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫికర్, షకిబల్ హసన్ ఆడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఔటైనా బంగ్లాకు కష్టాలు తప్పవు.