: అర్జున్ 150వ చిత్రం టైటిల్ టీజర్ అదుర్స్!
అరున్ వైద్యనాధన్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తోన్న కొత్త చిత్రం టైటిల్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా అర్జున్ నటిస్తోన్న 150వ చిత్రం. ఈ సినిమాకి తమిళంలో నిబునన్ అని, తెలుగులో కురుక్షేత్రం అని టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రసన్న, వరలక్ష్మి, వైభవ్, సుమన్, సుహాసిని ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఈరోజు విడుదలైన టైటిల్ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.