: సెమీస్ లో స్థానం కోసం విరాట్ కోహ్లీ వేసిన ప్లాన్ ఇది!


321 పరుగుల కష్టసాధ్యమైన స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచి కూడా విజయం సాధించడంలో విఫలమై, నాకౌట్ దశకు చేరే అవకాశాన్ని సంక్లిష్టం చేసుకున్న టీమిండియా, తదుపరి మ్యాచ్ లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందడుగు వేయనుంది. ఇందుకోసం విరాట్ కోహ్లీ కొత్త ప్లాన్ వేశాడు.

"తరువాతి గేమ్స్ లో మరింతగా కృషి చేయాలి. ఈ స్కోరుకన్నా ఇంకో 20 పరుగులైనా బోర్డుపై ఉంచాలి. ఎందుకంటే తరువాతి మ్యాచ్ ని కూడా ఇదే మైదానంలో (ఓవెల్) ఆడుతున్నాం కాబట్టి" అని చెప్పుకొచ్చాడు. తామేమీ బ్యాటింగ్ లో వైఫల్యం చెందలేదని చెప్పిన ఆయన, ఓటమితో దిగాలు చెందకుండా దీన్నో చెడు రోజుగా మాత్రమే భావించి, మరచిపోవాలని సహచరులకు పిలుపునిచ్చాడు.

  • Loading...

More Telugu News