: సానియా మీర్జాకు, సన్నీ లియోన్ కు లింక్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ
'సర్కార్-3' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షార్ట్ ఫిల్మ్ లపై దృష్టి సారించాడు. 'మేరీ భేటీ సన్నీలియోన్ బన్నా చాహ్తీ హై' అనే షార్ట్ ఫిల్మ్ ను తీశాడు. యూట్యూబ్ లో ఈ షార్ట్ ఫిలింకు ఇప్పటి వరకు దాదాపు 37 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇదే సమయంలో ఈ షార్ట్ ఫిలిం పట్ల పలు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో తన షార్ట్ ఫిల్మ్ గురించి వర్మ స్పందించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ తనకు గతాన్ని గుర్తు చేసిందంటూ ఓ అమ్మాయి తనకు మెసేజ్ చేసిందని వర్మ తెలిపాడు. ఆ అమ్మాయి గతంలో ఓ టెన్నిస్ ప్లేయర్ అట. యుక్త వయసుకు వచ్చిన తర్వాత టెన్నిస్ ఆడకుండా ఆ అమ్మాయిని ఆమె తండ్రి ఆపేశాడట. ఆటలో పొట్టి స్కర్టులు వేసుకోవాల్సి రావడమే దీనికి కారణమట. ఇలాంటి సంకుచిత మనస్తత్వాలు మన చుట్టూ చాలా ఉంటాయని... ఇలాంటి వాటి గురించి చెప్పడానికే, తాను ఈ షార్ట్ ఫిల్మ్ తీశానని చెప్పాడు. ఇదంతా బాగానే ఉంది. కానీ దీనికి సానియామీర్జా ఫొటోను జత చేశాడు వర్మ. షాట్ ఆడుతున్న సందర్భంగా సానియా స్కర్ట్ కొంచెం పైకి లేచి ఉంది ఈ ఫొటోలో. ఈ ఫొటో ఇప్పుడు వివాదాస్పదమైంది.