: సెహ్వాగ్ నోట ‘మహేంద్ర బాహుబలి’ మాట!


ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-శ్రీలంక మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో ధోనీ ఆటతీరుపై వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న సెహ్వాగ్, ధోనీ హాఫ్ సెంచరీ చేశాక..‘ అతను మహేంద్ర ధోనీ కాదు, మహేంద్ర ‘బాహుబలి’’ అని వ్యాఖ్యానించాడు. దీంతో నెటిజన్ల నుంచి సానుకూలమైన కామెంట్లు వస్తున్నాయి. ధోనీని ఇకపై మహేంద్ర బాహుబలి అని పిలవాలని నెటిజన్లు వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News