: లండన్ బ్రిడ్జిపై ఉగ్రవాదులను ఇలా మట్టుబెట్టారు... సీసీటీవీ ఫుటేజ్ చూడండి!
గడచిన శనివారం నాడు ప్రఖ్యాత లండన్ బ్రిడ్జిపై దాడికి దిగి ఎనిమిది మంది అమాయకులను హత్య చేసి, మరో 50 మందికి తీవ్రగాయాలు కావడానికి కారణమైన ఉగ్రవాదుల్లో ఒకరిని పోలీసులు టార్గెట్ చేసి, కాల్చి చంపిన వీడియో ఒకటి ఆన్ లైన్లో లీకైంది. లండన్ బ్రిడ్జిపై ఉగ్రవాది కాల్పులు జరుపుతూ వెళుతుండగా, కొంతమంది పాదచారులు అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించడం.. ఆ వెంటనే ఆ ప్రాంతానికి వాహనాల్లో దూసుకొచ్చిన పోలీసులు... ఉగ్రవాది వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం... పోలీసుల తూటాలు తగిలి ఉగ్రవాది కుప్పకూలడం... వంటి దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఆపై ఓ పోలీసు వచ్చి అతను ప్రాణాలతో ఉన్నాడో? లేదోనని పరిశీలించిన దృశ్యమూ ఉంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.