: అమరావతి ఎక్స్ ప్రెస్ లో దోపిడీకి యత్నం.. తిరగబడ్డ ప్రయాణికులు!


అమరావతి ఎక్స్ ప్రెస్ లో దోపిడీకి యత్నించిన నలుగురు వ్యక్తులపై ప్రయాణికులు తిరగబడ్డారు. హుబ్లీ-విజయవాడ మధ్య ప్రయాణించే ‘అమరావతి’ రైలులో ఈ రోజు ఉదయం ఈ సంఘటన జరిగింది. కర్ణాటకలోని బళ్లారి-తోరణగల్లు ప్రాంతంలోకి రైలు చేరుకోగానే మహిళా ప్రయాణికుల నుంచి నగలు లాక్కునేందుకు నలుగురు వ్యక్తులు యత్నించారు. దీంతో, తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి వారిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News