: ఓ నెటిజన్ సరదా ట్వీట్ కు సుష్మా స్వరాజ్ 'సూపర్' రిప్లై!


తమకు సాయం చేయాలని కొందరు, సలహాలు ఇవ్వమని మరికొందరు, ఆదుకోవాలని ఇంకొందరు.. ఇలా ట్వీట్లు చేసే వారికి అండగా ఉంటూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తక్షణం స్పందిస్తుంటారు. తాజాగా, కరణ్ సైని అనే ఓ నెటిజన్ చేసిన సరదా ట్వీట్ కు ఆమె స్పందించిన తీరు అద్భుతంగా ఉంది.

‘నేను మార్స్ లో చిక్కుకుపోయాను. ‘మంగళయాన్’ ద్వారా పంపించిన ఆహారం అయిపోయింది. ‘మంగళయాన్-2’ ఎప్పుడు పంపిస్తారు?’ అంటూ సుష్మాకు కరణ్ సైని సరదాగా ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన సుష్మా స్వరాజ్..‘మీరు మార్స్ లో చిక్కుకుపోయినా, భారత దౌత్యకార్యాలయం మీకు సాయం చేస్తుంది’ అంటూ బదులిచ్చారు. కాగా, కరణ్ సైని చేసిన సరదా ట్వీట్ పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రతి సమస్య విషయంలోనూ సుష్మా సీరియస్ గా స్పందించి వెంటనే సహాయం చేస్తుంటే, ఆమెతో ఇలా పరాచకాలు ఆడడమేంటంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News