: పెళ్లి షాపింగ్ త్వరలో మొదలుపెడతాం: హీరో నాగ చైతన్య
తమ పెళ్లి షాపింగ్ ను త్వరలో మొదలుపెడతామని మీడియాతో హీరో నాగచైతన్య చెప్పాడు. ‘పెళ్లిలో ఎలాంటి స్పెషల్ లుక్ లో మీరు, సమంత కనపడనున్నారు?’ అనే ప్రశ్నకు చైతూ సమాధానమిస్తూ, ‘ఇంకా డిసైడ్ చేయలేదు’ అని చెప్పాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం సక్సెస్ ను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు. సమంత, తాను కలిసి నటించే చిత్రానికి సంబంధించి ఇంకా ఏ స్క్రిప్టూ సెలెక్టు చేయలేదని అన్నాడు. త్వరలో మంచి స్క్రిప్ట్ ఉన్న చిత్రంలో తామిద్దరం నటిస్తామని తెలిపాడు. కాగా, నాగచైతన్య- సమంతల పెళ్లి అక్టోబర్ 6వ తేదీన జరగనున్నట్టు చైతూ నిన్న ప్రకటించాడు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుంది.