: లెజెండ్ సూపర్ స్టార్ ని కలిసినందుకు గొప్పగా భావిస్తున్నా: 'మహా' సీఎం ఫడ్నవీస్ సతీమణి
ముంబైలో ‘కాలా’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు చెన్నైకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న సమయంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ని రజనీ కలిశారు. ఈ సందర్భంగా అమృత ఫడ్నవీస్ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో రజనీపై ప్రశంసలు కురిపించింది. ‘లెజెండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలవడం గొప్పగా భావిస్తున్నాను. గొప్ప మానవతావాది, పద్మ విభూషణ్ రజనీ పలు సామాజిక అంశాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు’ అని అమృత అన్నారు. ఈ సందర్భంగా రజనీతో మాట్లాడుతున్న ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు.