: హాఫ్ సెంచరీలు చేసిన గుణతిలక, మెండిస్..100 మార్కును దాటిన శ్రీలంక స్కోరు
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు కొనసాగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తమ ముందు ఉంచిన 322 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ పోరాడుతున్నారు. 11 పరుగుల వద్ద శ్రీలంక ఓపెనర్ వెల్లా (7).. కుమార్ బౌలింగ్‌లో అవుటైన విషయం తెలిసిందే. మరో ఓపెనర్ గుణతిలక మాత్రం ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. వెల్లా అవుటైన తరువాత క్రీజులోకి వచ్చిన మెండిస్ కూడా రాణిస్తూ అర్ధసెంచరీ సాధించాడు. ప్రస్తుతం గుణతిలక 60, మెండిస్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 23 ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 130 పరుగులుగా ఉంది.