: తెలంగాణ జెన్ కో కూడా ఏపీకి విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వస్తుంది: టీఎస్ జెన్ కో చైర్మన్
ఏపీ జెన్ కో ఇటీవల రాసిన లేఖకు తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో చైర్మన్ ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏపీ నుంచి తెలంగాణకు రూ.1676.46 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, ఆ బకాయిలను ఇప్పటికీ చెల్లించలేదని, దీంతో, తెలంగాణ డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని టీఎస్ జెన్ కో చైర్మన్ పేర్కొన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన బకాయిలను ప్రస్తావిస్తూ, తెలంగాణకు ఇవ్వాల్సిన బకాయిలను విస్మరించారని అన్నారు. తెలంగాణ జెన్ కో కూడా ఏపీకి విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన రుణాలను ఏపీ ఇంతవరకూ చెల్లించలేదని, తెలంగాణకు చెల్లించాల్సిన బకాయిలపై ఏపీ స్పందించాలని, ఈ సమస్యను తక్షణం పరిష్కరించుకోవాలని ఆ ప్రత్యుత్తరంలో కోరారు.