: నాగ చైతన్య-సమంత మ్యారేజ్ డేట్ ఫిక్సయింది!
టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతల పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ ఏడాది అక్టోబర్ 6న వారి వివాహం జరగనుంది. ఐఫా అవార్డుల వేడుకల నిమిత్తం జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని ఈ జంట బయటపెట్టడం విశేషం. వీరి వివాహం గోవాలో జరగనుంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం ఈ వివాహం జరగనుంది. కాగా, ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో నటించినప్పటి నుంచీ చైతూ, సమంత మధ్య ప్రేమ చిగురించింది. కాగా, నాగ చైతన్య, సమంతల నిశ్చితార్థం జనవరిలో వైభవంగా జరిగింది. అప్పటి నుంచి వారి పెళ్లి తేదీలకు సంబంధించి పలు ఊహాగానాలు తెరపైకి రావడం తెలిసిందే.