: రోహిత్ శర్మ అర్ధ సెంచరీ.. 100 మార్కును దాటిన టీమిండియా స్కోరు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు శ్రీలంకతో తలపడుతున్న భారత్ మొదట బ్యాటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు వికెట్ నష్టపోకుండా 100 దాటేసింది. 59 బంతుల్లో రోహిత్ శర్మ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 57 పరుగులతో, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 20 ఓవర్లకి 107 గా ఉంది.