: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే దుస్థితి నెలకొంది: వీహెచ్


గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్న మధ్యప్రదేశ్ రైతులపై కాల్పులు జరపడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు (వీహెచ్) మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ పాలిత రాష్ట్రాలంతటా ఇదే దుస్థితి నెలకొందని విమర్శించారు. బీసీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించాలని, ఈ నేపథ్యంలో రాహుల్ ను ఆహ్వానించి సభ ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు చెప్పారు. కాగా, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరిపై నిన్న జరిగిన దాడిని వీహెచ్ ఖండించారు.

  • Loading...

More Telugu News