: సోనియా, మన్మోహన్ లు అనుమతిస్తేనే ఆ చిత్రానికి ఓకే చెబుతాం!: తేల్చిచెప్పిన సెన్సార్ బోర్డు
హన్సల్ మెహతా నిర్మాతగా, విజయ్ రత్నాకర్ దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’కు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. బుధవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్, సోనియాగాంధీలు సహా పలువురు రాజకీయ నేతల ప్రస్తావన ఉంటుంది కాబట్టి, భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేందుకు సోనియా, సింగ్ ల నుంచి నిరభ్యంతర పత్రాన్ని తీసుకు రావాలని నిర్మాతలను సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ పహ్లజ్ నిహ్లానీ ఆదేశించారు. వారి నుంచి ఎన్వోసీ తెచ్చిన తరువాతనే చిత్రంపై ముందుకు వెళ్లాలని, తామూ అప్పుడే విడుదలకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు.