: టీమిండియాను ఓడించడం చాలా కష్టం: శ్రీలంక కెప్టెన్


టీమిండియాను ఓడించడం చాలా కష్టమని శ్రీలంక జట్టు కెప్టెన్ ఏంజెలో మాధ్యూస్ తెలిపాడు. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు ఆడిన తొలి మ్యాచ్ కు దూరమైన మాథ్యూస్ టీమిండియాతో మ్యాచ్ కు ఫిట్ గా ఉన్నానని చెప్పాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా, ఉపుల్ తరంగ రెండు మ్యాచ్ ల సస్పెన్షన్ ఎదుర్కొంటుండగా, జట్టులో కీలకమైన మాథ్యూస్ ఈ మ్యాచ్ లో అందుబాటులోకి రావడంతో లంకజట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ నేపథ్యంలో మాథ్యూస్ మాట్లాడుతూ, గత రెండేళ్లుగా టీమిండియా అద్భుతమైన, స్థిరమైన ప్రదర్శన చేస్తోందని అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో సమతూకంతో ఉన్న టీమిండియాను ఓడించడం చాలా కష్టమని, అయితే ఓడించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని అన్నాడు. 

  • Loading...

More Telugu News