: పేటీఎం అప్‌డేటెడ్: ఇక ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ చలాన్లూ చెల్లించవచ్చు!
మొబైల్ పేమెంట్ యాప్ పేటీఎం.. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులను మరింత సులభతరం చేసింది. ఇందుకోసం యాప్‌లో ‘ట్రాఫిక్ చలాన్’ ఆప్షన్‌ను చేర్చింది. దీనిని ఉపయోగించి వాహనదారులు ట్రాఫిక్ చలాన్లను చెల్లించవచ్చని తెలిపింది. ‘ట్రాఫిక్ చలాన్’ ఆప్షన్‌ను ట్యాప్ చేస్తే వాహనం నంబరు అడుగుతుంది. అనంతరం చెల్లించాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్‌ను ట్యాప్ చేస్తే పేమెంట్ చేసినట్టే. ప్రస్తుతం ట్రాఫిక్ చలాన్లను ఎంపిక చేసిన కౌంటర్లలో నగదును మాత్రమే అనుమతిస్తుండడంతో వాహనదారులకు అది పెద్ద సమస్యగా మారిందని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేయడం తమకు ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ అవకాశం ముంబై, పుణె, విజయవాడలో ఉందని, త్వరలో అన్ని నగరాలకు విస్తరిస్తామని వాసిరెడ్డి వివరించారు.